24-04-2025 02:16:48 AM
నిజామాబాద్, ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): రైతు మహోత్సవం చివరి రోజైన బుధవారం జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతుతో పాటు అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి తదితరులు రైతు మహోత్సవ వేదిక, స్టాళ్లను సందర్శించారు. రైతులు, రైతు ప్రతినిధులతో మమేకం అయ్యి మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమం గురించి వారి స్పందనను తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, ఉద్యానవన శాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ రావు, వివిధ శాఖల అధికారులు ఉన్నారు.