24-04-2025 02:20:30 AM
కామారెడ్డి టౌన్‌ఏప్రిల్ 23 (విజయ క్రాంతి): బుధవారం విడుదలైన ఇంటర్ ఫలితాలలో స్థానిక వి ఆర్ కె జూనియర్ కళాశాల తెలంగాణ విశ్వవిద్యాలయం విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచడం జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఏ.పూర్వజ బైపీసీలో-994/1000 మార్కులు, విద్వేష్ ఎంపీసీలో-993/1000 మార్కులు, నందిని సీఈసీలో 935/1000 మార్కులు సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో మైథిలి ఎంపీసీలో 467/470, నవోదయ బైపీసీలో-434/440, అనన్య సీఈసీ లో491/500 మరియు ఒకేషనల్ ఫలితాలలో అఖిల ఎంపీపిహెచ్ డబ్ల్యు496/500, ప్రభంజన్ ఎంఎల్‌టిలో-488/500, జస్వంత్ ఫిజియోథెరపీ 464/500 విద్యార్థులు వివిధ గ్రూపులలో స్టేట్ టాపర్లుగా నిలవడం జరిగింది.
ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ నోడల్ అధికారి షేక్ సలాం విద్యార్థులకు పుష్పగుచ్చం మెమెంటోలు అందించారు. ప్రతీ సంవత్సరము విఆర్కే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నందుకు సీఈవో, ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులను అభినందించారు. కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ ఎం జైపాల్ రెడ్డి మాట్లాడుతూ వి ఆర్ కె జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాలలో వివిధ గ్రూపులలో స్టేట్ టాపర్లుగా నిలవడం ఎంతో ఆనందంగా ఉందని ఉన్నత లక్ష్యాలతో, ఉత్తమ మార్కులతో జూనియర్ కళాశాల విద్యావ్యవస్థలో నూతన ఒరవడి సృష్టించడం వి ఆర్ కే జూనియర్ కళాశాల విద్యార్థులకి సొంతమని అన్నారు. ఇంత గొప్ప విజయాన్ని అందించి విద్యార్థులుఉన్నత ర్యాంకులను తీసుకువచ్చిన ప్రతి విద్యార్థికి తల్లిదండ్రులకి, అధ్యాపక బృందానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సీఈఓ డాక్టర్ ఎం జైపాల్‌ల్ రెడ్డి ప్రిన్సిపాల్ శంకర్ ,డీన్ నవీన్ కుమార్, కో ఆర్డినేటర్ దత్తాత్రి అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.