30 June, 2026 | 10:08 PM

Breaking News

పెంచికల్‌పేట్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ   •   మండల అధ్యక్షులుగా అంకం శ్రీనివాస్   •   రాంకీ డంపింగ్ యార్డ్ తొలగింపే లక్ష్యం   •   రాష్ట్రంలో ఎక్కడ చూసినా కులవివక్షత కొనసాగుతుంది   •   ఉపాధ్యాయులు, ఎస్‌ఎస్‌ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   ఓటరు ఎన్యూమరేషన్ (SIR )పారాలు బిఎల్ఓ యాప్ లో నమోదు చేయాలి   •   దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •  

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని చదువుకోవాలి

18-07-2025 08:29 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

కామారెడ్డి అర్బన్,(విజయక్రాంతి): విద్యార్థులు  ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకుని ప్రణాళిక ప్రకారం చదువుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రం లోని బాలుర ఉన్నత పాఠశాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ప్రతిరోజూ పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావాలని, ఐఐఐటి సాధించాలన్నారు. ప్రధా నోపాధ్యాయులు, ఎఫ్ఆర్ఎస్, యూనిఫారం, పాఠ్య  పుస్తకాలు, నోటు పుస్తకాలు, ఎల్ ఐ పీ తప్పనిసరిగా ఆన్లైన్ ఎంట్రీ చేయాలని ఆదేశించారు. ఐ ఎఫ్ పీ ప్యానెల్స్ వినియోగించాలన్నారు. విద్యార్థుల పట్ల వ్యక్తిగత శ్రద్ధ పెట్టీ ఉన్నత ఫలితాలు సాధించాలని ఆయన ఆదేశించారు. వన మహోత్సవం లో  భాగం గా మొక్కలు నాటారు. నాటిన మొక్కలను పరిరక్షించాలని అన్నారు, పాఠశాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలని ఆయన ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల హాజరు పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.  విద్యార్థులహాజరు మెరుగు పరిచేలా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలన్నారు. భవిత సెంటర్ లో పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఇంజనీరింగ్  అధికారులను  ఆదేశించారు.