జనగణన సమర్థవంతంగా నిర్వహించాలి
* నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్
అచ్చంపేట: ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు జనగణను సమర్థవంతంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. అచ్చంపేటలోని ఎంఎస్ఎన్ హైస్కూలో జరుగుతున్న జనగణన శిక్షణ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. అక్కడ అందిస్తున్న శిక్షణ తరగతులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. గతంలో కాగితంపై జనగణన వివరాల రాసేవారని, ప్రస్తుతం 2027 జనగణన కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రత్యేక యాప్లో డిజిటల్ సర్వే జరుగుతుందని, ఇండ్లు, జనగణన జాగ్రత్తగా చేయాలన్నారు.
డిజిటల్ సర్వే చేసేటప్పుడు ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు యాప్లో పొరపాటున తప్పులు నమోదు చేసిన సరిచేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లే ముందు తమకు అందజేసిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా హద్దులను ముందస్తుగా తనిఖీ చేసుకోవాలని వెల్లడించారు. ప్రతి ప్రశ్నకు సమాధానం నమోదు చేసి సర్వేను పకడ్బందీగా చేయాలని తెలిపారు. శిక్షణ సందర్భంగా ఏవైనా అనుమానా ఉంటే క్లియర్ చేసుకోవాలని చెప్పారు.
శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని, జిల్లా అభివృద్ధికి తోడ్పడే జనగణన పకడ్బందీగా నిర్వహించాలని ఆకాంక్షించారు. అనంతరం మన్ననూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, తాహసిల్దార్ సైదులు, మాస్టర్ ట్రైనర్లు, ఇతర అధికారులు తదితరులు ఉన్నారు






