20 June, 2026 | 7:14 PM

Breaking News

ఫీజులు నియంత్రించకపోతే ఆందోళ తప్పదు   •   నామ భద్రయ్య మృతి పట్ల మాజీ ఎంపీ నామ, ఎంఎల్సీ తాతా మధుసూదన్ సంతాపం   •   మధిర కోర్టు ఆవరణలో జాతీయ మెగా లోక్ అదాలత్   •   సింగరేణి ఖాళీ క్వార్టర్ల సద్వినియోగానికి చర్యలు తీసుకోవాలి: ఏఐటీయూసీ   •   కొమరారం మండల ఏర్పాటుకు మంత్రి దామోదర రాజనరసింహకు వినతి   •   యువత హక్కుల కోసం కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుంది   •   రైతులను నమ్మించి నట్టేట ముంచుతారా   •   కేరళ గ్లోబల్ హై స్కూల్‌లో ఘనంగా ముందస్తు యోగా దినోత్సవం   •   అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి   •   సీఆర్టీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్   •  

ఆస్పత్రి సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం

20-06-2026 06:01 PM

ఆకస్మిక తనిఖీతో అడలెత్తించిన కలెక్టర్

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అధికారుల తీరుపై జిల్లా కలెక్టర్ శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆకస్మిక తనిఖీకి వెళ్లిన కలెక్టర్ ఓపి జనరల్ వాళ్లు ఆసుపత్రి ఆవరణ వైద్యుల పనితీరుపై ఆరా తీశారు. రోగులతో మాట్లాడారు. ప్రతి విభాగాన్ని పరిశీలించి నాలుగు గంటలసేపు ఆసుపత్రి కలియ చూడగా అక్కడ విధిని నిర్మించి సిబ్బంది కలెక్టర్ తనిఖీతో అడలెత్తిపోయారు. జిల్లాలోని పేద ప్రజలందరికీ మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.

శనివారం ఆయన నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఆన్‌లైన్ విధానంలో జరుగుతున్న ఓపీ సేవల నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. ప్రజలకు అందుతున్న వైద్య సేవల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజూ సగటున నమోదవుతున్న ఓపీ వివరాలతో పాటు, ఏ విభాగాలకు చెందిన చికిత్సల కోసం ఎక్కువ మంది రోగులు వస్తున్నారో ఆరా తీశారు.

అనంతరం ఆసుపత్రిలోని ప్రతి విభాగాన్ని సందర్శించి, రోగులకు అవసరమైన వైద్య సేవలు సకాలంలో అందించాలని, అవసరమైన వారికి తక్షణమే రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని సూచించారు. రోగుల సౌకర్యార్థం వివిధ విభాగాలను సూచించే సైన్ బోర్డులను ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు.

ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను పరిశీలించిన కలెక్టర్, ప్రతి రికార్డును పకడ్బందీగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ విభాగాన్ని పరిశీలించిన ఆయన, ఇంకా పూర్తి కావాల్సిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ తనిఖీలో ఆసుపత్రి పర్యవేక్షకులు గోపాల్ సింగ్, వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శారద, వైద్య శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.