భట్టుపల్లిలో ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, జూలై 29(విజయ క్రాంతి): ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్ప ష్టత అత్యంత ముఖ్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవా రం కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభు త్వ భూమిని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత భూమికి సంబంధించిన పూర్తి వివరాలను తహసీల్దార్ రాజును అడిగి తె లుసుకున్నారు.
భూమి కేటాయింపుకు సంబంధించిన రికార్డులు, మ్యాపులను పరిశీలించి, వాటి లో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులతో కలిసి భూమి హద్దులను ప్రత్యక్షంగా పరిశీలించారు. భూమి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందనే అంశంపై స్పష్టత పొందుతూ, భూ రికార్డులు, క్షేత్రస్థాయి పరిస్థితులు ఒకే విధంగా ఉండే లా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భూముల రక్షణ, వాటి సక్రమ నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ఈ పరిశీలనలో సర్వేయర్ స్టాలిన్, ఆర్‌ఐ కృష్ణ, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






