30 July, 2026 | 12:49 AM

ఘనంగా కొండగట్టు అంజన్న గిరిప్రదక్షిణ

30-07-2026 12:00 AM

పాల్గొన్న మంత్రులు, విప్, ఎమ్మెల్యేలు

జగిత్యాల/కొండగట్టు, జూలె ై29 (విజయక్రాంతి): గురు వ్యాస పౌర్ణమి సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామి గిరిప్రదక్షిణలు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తో పాటు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు.

తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తున్నప్పటికీ లెక్కచేయకుండా గిరి ప్రదక్షిణల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆంజనేయస్వామి చూడాలని కోరుకున్నట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. అనంతరం ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

రాష్ర్టంలో సమృద్ధి గా వర్షాలు కురిసి రైతుల పొలాలు పాడిపంటలతో కళకళలాడాలని, ప్రతి రైతు సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల మధ్య మంత్రులు, ప్రజాప్రతినిధులకు ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.