23 May, 2026 | 7:51 AM

గొడవను అడ్డుకోబోయిన వృద్ధురాలి హత్య

18-06-2024 11:22 PM

కామారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): తండ్రి, కొడుకుల మధ్య జరుగుతున్న గొడవను అడ్డుకోబోయిన ఓ వృద్దురాలిని ఇటుక తో కొట్టి చంపిన ఉదంతమిది. కామారెడ్డి మండలం తిమ్మక్‌పల్లికి చెందిన రాగుల లక్ష్మి(75) ఇంటి పక్కన ఉండే రాగుల రాజశేఖర్, అతని తండ్రి లక్ష్మినారాయణ సోమవారం రాత్రి గొడవ పడుతున్నారు. అక్కడే ఉన్న రాగుల లక్ష్మిగొడవను అడ్డుకోబోయింది. దీంతో కోపోద్రిక్తుడైన రాజశేఖర్ ఇటుక పెళ్లతో లక్ష్మితలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడినుంచి హైదరాబాద్‌కు తరలి స్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. పాత కక్షల నేపథ్యంలో తన తల్లిని రాజశేఖర్ చంపాడని మృతురాలి కొడుకు పెద్దనర్సింలు ఫిర్యాదు చేసినట్టు ఎస్సై రాజు తెలిపారు.