2 May, 2026 | 7:19 PM

Breaking News

ప్రజా పాలనతో దేశంలో ముందంజలో తెలంగాణ   •   అకాల వర్షంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి   •   మహిళాల భద్రతపై అవగాహన కల్పించిన షీ టీం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అన్నదాతల అవగాహన కార్యక్రమం   •   మేడ్చల్ జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షుడిగా కేకే చారి ఎన్నిక   •   ప్రజా అవసరాలను గుర్తించి పరిష్కరించేలా ప్రజా పాలన సభలు   •   గుండెపోటుతో మరణించిన హోంగార్డ్ సురేష్ భౌతిక కాయానికి నివాళులర్పించిన ఎస్పీ రోహిత్ రాజు   •   ఆర్డీవో ఆఫీసుల్లోనూ ప్రజావాణి..!   •   సిబ్బంది అంకితభావంతో విధులు నిర్వహించాలి   •   నీట్ పరీక్షపై ఇన్విజిలేటర్ల ఓరియెంటేషన్ కార్యక్రమం   •  

పరిశీలించి... రుచి చూసి…

12-03-2026 03:04 PM

ఆదర్శ క్రీడా పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఆదర్శ క్రీడా పాఠశాలను గురువారం జిల్లా కలెక్టర్ కె. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలోని వంటగది, స్టోర్ రూమ్,పాఠశాల పరిసర ప్రాంతాలను పరిశీలించి పరిశుభ్రత పాటించాలని సిబ్బందికి సూచించారు.విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలన్నారు.

వంటగదిలో తయారుచేసిన అల్పాహారాన్ని స్వయంగా పరిశీలించి రుచి చూసిన కలెక్టర్, ఆహార నాణ్యతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. క్రీడా విద్యార్థులు ఆరోగ్యంగా ఉండేందుకు సమయానికి పౌష్టికాహారం అందించాలని తెలిపారు.పాఠశాలలో పరిశుభ్రత, ఆహార నాణ్యత, విద్యార్థుల వసతి సదుపాయాలపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.