12 March, 2026 | 5:11 PM

జయ్యారం జడ్పీ స్కూల్లో విద్యార్థుల వీడ్కోలు సమావేశం

12-03-2026 03:06 PM

మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండలం జయ్యారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల(Zilla Parishad High School)లో  పదవ తరగతి ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు నిర్వహించారు. వీడ్కోలు సమావేశానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు  ఉషశ్రీ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టపడి చదివి పడవతరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించి పాఠశాలకు మంచిపేరు తేవాలని పేర్కొన్నారు.

ఉపాధ్యాయులు రామకృష్ణ  ప్రసంగిస్తూ కార్పొరేట్ పాఠశాలల కన్నా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఆలోచన శక్తి సృజనాత్మక శక్తి అధికంగా ఉంటుందని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న  వారు కలెక్టర్లుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా ఉన్నత స్థితిలో ఉన్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు ఉపేందర్ మాట్లాడుతూ పరీక్షల్లో అక్షర దోషాలు లేకుండా అందంగా రాయాలని పరీక్షల మెలుకువలను విద్యార్థులకు తెలియజేశారు . 

ఉపాధ్యాయులు ఉపేందర్  మాట్లాడుతూ లక్ష్యాలు నిర్దేశించుకుని లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. తర్వాత అంగరంగ వైభవంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలలో కోలాహలంగా విద్యార్థిని విద్యార్థులు పాటలు స్టెప్పులతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో.  ముఖ్య అతిథి ఎంఇఓ పిఎంశ్రీ జయరం మోడల్ ఆఫీసర్ ఎన్.రవి కుమార్  తేజోనాథ రెడ్డి  ప్రధానోపాధ్యాయులు ఉషశ్రీ , ఉపాధ్యాయులు రామకృష్ణ , ఉపేందర్, విద్యార్థులు పాల్గొనారు.