ఈవీఎం గోదామును తనిఖీ చేసిన కలెక్టర్
10-06-2025 06:16 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఎన్నికల సామాగ్రి భద్రపరిచే ఈవీఎం గోదాములను మంగళవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(District Collector Abhilasha Abhinav) పరిశీలించారు. అక్కడ భద్రత చర్యలను పోలీసు సిబ్బందిని అడిగి తెలుసుకున్న ఆమె భద్రత కట్టుదిట్టంగా ఉండాలని సూచించి, రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గండ్ర రమేష్, శ్రావణ్ రెడ్డి, ప్రశాంత్ సయ్యద్, హైదర్ మజార్ తదితరులు ఉన్నారు.






