15 June, 2026 | 8:23 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

మెట్‌పల్లిలో 'ప్రజావాణి' కార్యక్రమాన్ని తనిఖీ చేసిన కలెక్టర్

11-05-2026 06:38 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పెల్లి డివిజన్ ప్రజావాణి కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెట్‌పల్లి ఆర్డీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించి ప్రజల నుండి అందుతున్న వినతులు, ఫిర్యాదుల స్వీకరణ విధానాన్ని పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ఉదేశ్యం తో గత వారం నుండి డివిజన స్థాయిలో ప్రజా వాణి కార్యక్రమాలు ప్రారంభించిందని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రజావాణికి వచ్చే ప్రతి దరఖాస్తును సకాలంలో పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సానుభూతితో విని, శాఖల వారీగా సమన్వయం చేసుకుని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు న్యాయం చేకూరేలా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు.