18 August, 2026 | 5:00 PM

Breaking News

చెట్లు నరికివేతపై ఫిర్యాదు   •   భిన్న దృక్కోణాల ద్వారా మానసిక సవాళ్లను పరిష్కరించాలి   •   బెస్ట్ ఎంప్లాయి అవార్డు గ్రహీతకు సన్మానం   •   ఆత్మ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణ   •   ఎమ్మార్వో పి.విట్టల్, సీఐ వెంకట్ నారాయణకు ఘన సన్మానం   •   భూస్వాముల అన్యాయానికి ఎదురునిలిచిన విప్లవ వీరుడు   •   సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •  

గ్రామసభకు సర్పంచ్ గెర్హాజరు

11-05-2026 06:35 PM

సర్పంచ్ వైఖరిపై గ్రామస్తుల ఆగ్రహం

కొల్చారం,(విజయక్రాంతి): గ్రామ సర్పంచ్ ఒంటెద్దు పోకడలపై  గ్రామస్థులు, వార్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన సంఘటన సోమవారం కొల్చారం మండలం  వరిగుంతంలో జరిగింది. సోమవారం ఉదయం గ్రామసభ హనుమాన్ మందిరం వద్ద నిర్వహించనున్నట్లు సాటింపు వేయడంతో గ్రామస్తులు వార్డు సభ్యులు ఉపసర్పంచ్ వీరేశం తదితరులు హనుమాన్ మందిరం వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయినప్పటికీ సర్పంచ్ గ్రామంలోనే ఉండి గ్రామ సభకు రాలేదు. సర్పంచ్ గ్రామపంచాయతీ పనులు తన ఇష్టం ఉన్న పద్ధతిలో చేస్తున్నట్లు వార్డు సభ్యులు గ్రామసభలు ప్రజల దృష్టికి తీసుకువచ్చారు.

గ్రామంలో సమస్యలు పరిష్కరించడంపై సర్పంచ్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు గ్రామస్తులు, వార్డు సభ్యులు ఆరోపించారు. వెంటనే సర్పంచ్ తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని గ్రామాభివృద్ధి విషయంలో పంచాయతీ నిధుల ఖర్చుల విషయంలో వార్డు సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రామస్తులు వార్డు సభ్యులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ గౌడ్, సహకార సంఘం అధ్యక్షులు చిన్నారపు ప్రభాకర్ మాజీ అధ్యక్షులు  బోడాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు.