18 July, 2026 | 12:06 AM

అల్వాల్‌లో సర్ ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్

18-07-2026 12:06 AM

మేడ్చల్, జూలై 17 (విజయక్రాంతి): జిల్లాలోని అల్వాల్ మండలంలోని 9వ నంబరు పోలింగ్ స్టేషన్ దగ్గర నిర్వహిస్తున్న సర్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ మను చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బిఎల్‌వోలు ఎన్యు మరేషన్ ఫారాలను ఇవ్వడంలోనూ అదే విధంగా పూరించిన ఫారాలను తీసుకోవడంలోనూ పూర్తి బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఫారాలు పూ రించడంలో ఓటర్ల సందేహాలను నివృత్తి పరుస్తూ వారికి అవగాహన కల్పించాలన్నారు.

సర్ ప్రక్రియను వేగవంతం చేస్తూనే తీసుకున్న ఫారాలను వెంటవెంటనే డిజిటలైజ్ చేయించాలని బిఎల్‌ఓ లను ఆదేశించారు. తీసుకున్న ఫారాల డిజిటలైజ్ ఏవిధంగా చేస్తున్నారని ప్రత్యక్షంగా పరిశీలించారు. అందుబాటులో లేని ఓటర్ల వివరాలను సూపర్వైజర్లకు అందించాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. రోజువారీ టార్గెట్‌ను ఏ విధంగా పూర్తి చేయాలో అవసరమైన సలహాలు సూచనలు  కలెక్టర్ బిఎల్‌ఓలకు ఇచ్చారు.