18 July, 2026 | 12:05 AM

ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన వల్లారపు శ్రీనివాస్

18-07-2026 12:05 AM

సికింద్రాబాద్, జూలై 17 (విజయక్రాంతి): ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుని సికింద్రాబాద్ తెదేపా ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ అమరావతిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. తెలుగుదేశం పార్టీ ఇటీవల చేపట్టిన ప్రజాపథం కార్యక్రమం బౌద్ధనగర్ డివిజన్ పార్సీగుట్టలో ఘనవిజయం సాధించిన విషయం చంద్రబాబుకు వివరించినట్లు తెలిపారు. ఈసందర్భంగా వల్లారపు శ్రీనివాస్ మాట్లాడుతూ.. అందరు కష్టపడి పార్టీ పటిష్టతకు పని చేయాలని, ప్రజలతో మమేకమై ఉండాలని చంద్రబాబు ఆదేశించారని వల్లారపు శ్రీనివాస్ కుమార్ అన్నారు.