15 June, 2026 | 10:38 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

03-02-2026 04:18 PM

జిల్లా కలెక్టర్ కె. హరిత

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించి ఆసుపత్రిలోని వివిధ వార్డులు, పలు విభాగాలను పరిశీలించి, చికిత్స పొందుతున్న రోగులను వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రక్త నిల్వ గదిని పరిశీలించి వైద్యులు, నర్సులు, ఇతర సిబ్బంది రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై విచారించి వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చేవారిలో సామాన్యులు, ఆదివాసి గిరిజనులు ఎక్కువగా ఉంటారని, వారి పట్ల మర్యాదగా వ్యవహరించాలని తెలిపారు. వైద్యులు, సిబ్బంది విధుల పట్ల సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం వహించకూడదని తెలిపారు. ఆసుపత్రిలోని వార్డులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రోగులకు అందించే భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని తెలిపారు. రోగుల ఆరోగ్య స్థితిగతులపై వైద్యులు, సిబ్బంది ఎల్లప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి పర్యవేక్షకులు ప్రవీణ్, వైద్య కళాశాల ప్రిన్సిపల్ సుబోద్ కుమార్, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.