calender_icon.png 3 February, 2026 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించిన పవన్ కళ్యాణ్ సతీమణి

03-02-2026 04:21:04 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ మహానగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానాన్ని మంగళవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ సతీమణి  అన్నా లెజ్నెవా  సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన మంత్రి సతీమణికి ఆలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న స్వాగతం పలికారు.

ముందుగా ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించిన అనంతరం ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. పూజానంతరం ఆలయ స్నపన మండపంలో ముఖ్య అర్చకులు  చెప్పెల వెంకటనాగరాజ శర్మ, వేదపండితులు ప్రదీప్కుమార్ శర్మలు మహదాశీర్వచనం నిర్వహించి అమ్మవారి శేషవస్త్రములు బహూకరించి ప్రసాదములు అందజేశారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి ఆలయ కార్యనిర్వహణాధికారి రామల సునీత తదితరురులు పాల్గొన్నారు.