calender_icon.png 6 June, 2025 | 6:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ నేత ఎస్టీ కాదు... 35 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఉత్తర్వులు

04-06-2025 01:45:45 PM

హైదరాబాద్:  ఓ రాజకీయ నేత ఎస్టీ కాదని 35 ఏళ్ల తర్వాత కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. చావాన్ దేవానంద్ అనే నేతకు సంబంధించి కలెక్టర్ నేడు ఉత్తర్వులు ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడకు చెందిన దేవానంద్ ఎస్టీ కులస్తుడు కాదంటూ కలెక్టర్ తేల్చిచెప్పారు. చవాన్ దేవానంద్ 1990లో ఎస్టీ సర్టిఫికెట్ పొందినట్లు కలెక్టర్ తెలిపారు. దేవానంద్ కుమార్తెలు ఎస్టీగా రెండు సార్లు సర్పంచ్ గా పోటీ చేసి గెలిచారు. 2014లో ఎస్టీ రిజర్వ్ డ్ స్థానంలో దేవానంద్ ఎంపీటీసీగా గెలిచారు. దేవానంద్ కులంపై ఎస్టీ కమిషన్ కు బంజారా సంఘం నేతలు ఫిర్యాదు చేశారు. దేవానంద్ ఎస్టీ కాదని విచారణలో తేలడంతో ఎస్టీ హోదాను కలెక్టర్ రద్దు చేశారు.