04-06-2025 03:56:29 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): బాచుపల్లిలో ఓ ట్రావెల్ బ్యాగ్ లో మహిళ మృతదేహం కలకలం రేపింది. బాచుపల్లి రెడ్డీస్ ల్యాబ్ ప్రహరీ గోడకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో సూట్ కేస్ పడివుండటం స్థానికులు కనిపించింది. అందులో నుంచి దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు సూట్ కేసును తెరచి చూడగా, కుళ్లిన స్థితిలో ఎరుపు రంగ దుస్తుల్లో మహిళ మృతదేహం బయటపడింది. మహిళ వయస్సు 25-30 ఏళ్లు ఉండొచ్చని పోలీసులు అంచనా వేశారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, తాజా నమోదైన మిస్సింగ్ కేసుల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.