26 June, 2026 | 3:23 PM

భూ పంచాయతీకి వార్డు సభ్యులు బలి

26-06-2026 02:52 PM

- సిద్దిపేట జిల్లా దుద్దేడ గ్రామంలో ఘటన

కొండపాక (విజయక్రాంతి): భూమి క్రయవిక్రయాలలో తలెత్తిన పంచాయతీకి వార్డు సభ్యుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా కొండపాక మండలం గుద్దడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు. దుద్దెడ గ్రామ మాజీ ఉపసర్పంచ్, ప్రస్తుత వార్డు సభ్యులు గుండెల్లి అంజనేయులు శుక్రవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆంజనేయులు విక్రయించిన భూమి వివాదానికి దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

తదనంతరం ఏం జరుగుతుందో తెలియదు కానీ శుక్రవారం ఉదయం గ్రామ శివారు గల తన ఫామ్ హౌస్ వద్ద ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆంజనేయులు జేబులో సూసైడ్ నోట్ లభించినట్లు విశ్వాసనీయ సమాచారం అందులో తన కూతురిని డాక్టర్ ను చేయాలని కోరిక తీరకుండానే తను చాలిస్తున్నానని తన మరణానికి ఐదుగురు కారణమంటూ వారి పేర్లు కూడా అందులో ఉన్నట్లు తెలిసింది పోలీసుల విచారణ జరిపితేనే ఆంజనేయులు మరణానికి పూర్తి కారణాలు తెలుస్తాయని కుటుంబ సభ్యులు గ్రామస్తులు అంటున్నారు.