యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలి
నేరేడుచర్ల ఎస్ఐ ఏ.సైదిరెడ్డి
నేరేడుచర్ల,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని , డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని నేరేడుచర్ల ఎస్ ఐ సైదిరెడ్డి పిలుపునిచ్చారు. నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృతంగా యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో భాగoగా కల్లూరు గ్రామంలో మాదకద్రవ్యాల నిర్మూలనపై (యాంటీ డ్రగ్స్) ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మాదకద్రవ్యాల అలవాటు వల్ల కలిగే అనర్థాలను వివరించారు.గ్రామంలో ఎవరైనా గంజాయి లేదా ఇతర నిషేధిత డ్రగ్స్ విక్రయించినా, రవాణా చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది మరియు గ్రామస్తులు, యువత పాల్గొన్నారు.






