15 June, 2026 | 8:56 PM

Breaking News

ఆర్థిక పరిస్థితులను బాగు చేసింది ముఖ్యమంత్రి   •   గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి   •   అర్హులకే రేషన్ కార్డు.. ప్రభుత్వ ఉద్యోగుల కార్డులు తొలగించాలి   •   మండలంలోని పలు గ్రామాల కాంగ్రెస్ అధ్యక్షుల ఎన్నిక   •   సమ్మె విరమిస్తున్నాం... యధావిధిగా పనులు   •   అధికారులను సమన్వయం చేసుకోలేని దద్దమ్మ రేవంత్ రెడ్డి   •   రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •  

అందుబాటులో ఉండి రోగులకు సేవలందించాలి కలెక్టర్ రాహుల్ రాజ్

03-02-2025 12:38 AM

రామాయంపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తనిఖీ

రామాయంపేట, ఫిబ్రవరి 2: వైద్యులు అందుబాటులో ఉండాలని, రోగులకు సేవలందిం చాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వైద్యాధికారులను ఆదేశించారు. రామాయంపేట పీహెచ్సీని కలెక్టర్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దవాఖానలోని మందులు అందించే గది, రక్త పరీక్షల చేసే ల్యాబ్, ఇన్ పేషెంట్ వార్డ్, మందులు నిల్వ చేసే స్టోర్ రూంను, పరిశీలించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ  రోగులకు మెరుగైన చికిత్స అందిం చాలని, వైద్యులు, సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండాలని, ఆసుపత్రిని నిరంతరం పరిశుభ్రంగా ఉంచాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఔషధ నిల్వలు స్టాక్ పెట్టుకోవాలన్నారు. ఆసుపత్రిలో రోగులకు శుచికరమైన బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలని సూచించారు.

ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని ఆదేశించారు. అన్ని రకాల మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు.