ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ రిజ్వాన్ భాషా
16-06-2026 12:43 AM
గద్వాల జూన్ 15: ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో హాజరు, మధ్యాహ్న భోజనం, మౌలిక సదుపాయాలను పరిశీలించి వాటి నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.
తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ అవసరమని సూచించారు. 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడిన ఆయన బలహీనమైన సబ్జెక్టులపై శ్రద్ధ పెట్టి మెరుగైన ఫలితాలు సాధించాలని ప్రోత్సహించారు. ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.






