16 June, 2026 | 1:22 AM

బీజేపీ తోలుబొమ్మ పవన్‌కళ్యాణ్

16-06-2026 12:42 AM
  1. రాజకీయాల్లో చాలా నేర్చుకోవాలి
  2. రాష్ట్ర ఏర్పాటుపై రెచ్చగొట్టేలా మాట్లాడితే ఊరుకోం 
  3. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ 

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): బీజేపీ ఆడించే తోలు బొమ్మ ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమా ర్‌గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుపై పవన్‌కల్యాణ్ పదే పదే కించపరిచే మాటలు మాట్లాడటం సరికాదన్నారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలు చూడనిదే నీ సిని మాలు ఆడాయా? ఇంత పెద్ద హీరోవు అయ్యావా? అని ప్రశ్నించారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఏపీలో మీరు చెయ్యాల్సింది చాలా ఉందని, రాజకీయాల్లో ఇంకా నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందంటూ హితవు పలికా రు. అధికారం ఉందని తెలంగాణ గురించి ఎలా పడితే అలా మాట్లాడితే సరికాదని, ఇలా గే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. విభజనకు వ్యతిరేకం గా మాట్లాడుతున్న పవన్ కల్యాణ్.. తెలంగాణ ఉద్యమంలో ఎక్కడున్నాడని ప్రశ్నించారు.

కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదన్నారు.బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో విభజన, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. పవన్ వ్యాఖ్యలపై కేసీఆర్, కేటీఆర్, బీఆర్‌ఎస్ మాట్లాడటం లేదంటేనే వారి వెనుక ఒప్పందం ఏమిటో అర్థం అవుతుందన్నారు. కాగా గాంధీ భవనన్ ‘మంత్రులతో ముఖాముఖి’ కార్యక్రమం ఈ నెల 17న పునఃప్రారం భం కానుంది. గతంలో ప్రతి బుధవారం గాం ధీభవన్‌లో ప్రజలతో ఒక మంత్రి ముఖాము ఖి కలిసేవారు. అక్కడ ప్రజల నుంచి వినతులు స్వీకరించేవారు. ఈ క్రమంలో బుధవారం  నుంచి ఈ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ నిర్ణయించింది. వచ్చే బుధవారం మంత్రి అజారుద్దీన్ ముఖాముఖీలో పాల్గొని ప్రజల నుం చి వినతి పత్రాలను స్వీకరించనున్నారు.