బెస్త, ముదిరాజ్‌లే ముఖ్య అతిథులు
- టీఆర్పీ వుమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజాగౌడ్
- చెరువు వద్దకు వెళ్లి సభ ఆహ్వాన పత్రిక అందజేత
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో భువనగిరిలో జూలై 5వ తేదీన నిర్వహించనున్న ‘రాజ్యాధికార సమరభేరి’ మహాసభకు సంబంధించి ప్రచార కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్నాయి. పోచంపల్లి మండలం జూలూరు గ్రామంలో మత్స్యకారు ల సంఘం అధ్యక్షుడు సోమ శ్రీనును టీఆర్పీ వుమెన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజాగౌడ్ కలిసి మహాసభకు ఆహ్వానం అందజేశారు.
సోమ శ్రీను తమ సంఘ సభ్యులతో కలిసి స్థానిక చెరువులో చేపలు పడుతున్న క్రమంలో నేరు గా చెరువులోకి దిగి వారికి ఆహ్వాన పత్రికను అందజేశారు. నీరజగౌడ్ మాట్లాడుతూ.. బెస్త, ముదిరాజ్‌లే ముఖ్య అతిథులు అని చెప్పారు. మత్స్యకారుల సమస్య లు, బీసీ వర్గాల రాజకీయ సాధికారత అవస రం, రాజ్యాధికార లక్ష్యాలపై చర్చించారు. సమాజంలోని ప్రతి వర్గం పెద్ద సంఖ్యలో భువనగిరి సభకు హాజరై విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్పీ మేడ్చల్ మల్కాజ్గిరి మహిళ అధ్యక్షురాలు శాలిని, కార్యదర్శి వనజ పాల్గొన్నారు.






