15 April, 2026 | 1:16 PM

Breaking News

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •  

సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

04-02-2026 04:22 PM

హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): ప్రతి సామాజిక వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం అని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. బుధవారం తెలంగాణ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమారంలో ఉన్న ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం(ధర్మసాగర్)లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సామాజిక న్యాయ దినోత్సవాన్ని నిర్వహించగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ... సమాజంలోని ప్రతి వర్గానికి సమాన అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్య సాధనలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు, విద్యా సంస్థలు కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. వెనుకబడిన, అణగారిన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలని కలెక్టర్ సూచించారు. బాలికలు ఆర్థికాభివృద్ధిని సాధించాలని అన్నారు.

ఆర్థిక స్వాతంత్ర్యం సాధించిన తర్వాతనే బాలికలు వివాహం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులతో సామాజిక న్యాయం, సమానత్వం, సమగ్ర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి నరసింహస్వామి, హసన్ పర్తి  తహసిల్దార్ కిరణ్ కుమార్, అసిస్టెంట్ బిసి వెల్ఫేర్ ఆఫీసర్ సంపూర్ణ,  వసతి గృహ వార్డెన్ ప్రియాంక, అధ్యాపకులు, కళాశాల వసతిగృహం విద్యార్థినులు పాల్గొన్నారు.