పాఠశాలల పునఃప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలి
వనపర్తి, విజయక్రాంతి : పాఠశాలల పునఃప్రారంభం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ ఆదేశించారు. పాఠశాలలు వేసవి సెలవు అనంతరం ఈ విద్యా సంవత్సరంలో బుధవారం నుండి పాఠశాలల పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ రేపటి పాఠశాలల పునఃప్రారంభం ఒక పండగ వాతావరణాన్ని కల్పించాలని అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పాఠశాలల అలంకరణతో పాటు విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, నోట్ పుస్తకాలు, ఏకరూప దుస్తులు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సెలవుల అనంతరం విద్యార్థులు తిరిగి పాఠశాలకు వెలుచున్న సందర్భంగా పిల్లలకు ఒక పండగ వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం నగేష్, జిల్లా విద్యా శాఖ అధికారి గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.






