5 July, 2026 | 7:31 PM

మీరు చెప్పిన లెక్కలు వాస్తవాలకు దురంగా ఉన్నాయి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

11-06-2024 04:59 PM

మహబూబ్ నగర్: గడిచిన వేసవిలో మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 100 బోరు బావులు ఎమ్మెల్యే సొంత నిధులతో వేయించిన విషయాన్ని గుర్తు చేస్తూ, మీరు చెప్పిన లెక్కలు ఎక్కడా మ్యాచ్ కావడం లేదని, పేపర్ మీద ఉన్న నెంబర్ నిజానికి సరిపోవడం లేదని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. మంగళ వారం మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం (ఐడిఓసి) లో జిల్లా కలెక్టర్, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ తో కలిసి  జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మిషన్ భగీరథ పై అనేక పిర్యాదులు ఉన్నాయని రాంరెడ్డి గూడెం లోని కంపెనీ లకు మిషన్ భగీరథ నీరు పోతుందని ఆరోపణలు ఉన్నాయని, వెంటనే దానిపై దృష్టి సారించి, క్రిమినల్ కేసులు పెట్టాలన్నారు. 

ఫిబ్రవరి 27 నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మాడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వల్ల అభివృద్ధి ఆగిపోయిందని ఇక మీదట అధికారులు అంతా కూడా అభివృద్ధి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. శంషాబాద్ నుంచి కర్నూలు వరకు ఇండస్ట్రీయల్ క్యారిడార్ చేయాలని ముఖ్యమంత్రి  భావిస్తుని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా  రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు దృష్టి పెట్టాలని సూచించారు.   గతంలో ప్రభుత్వ భూములు ఆక్రమించుకొన్న భూములు రికవర్ చేయాలని, అధికారులకు ఆదేశించారు. రేవంత్ రెడ్డి  ముఖ్యమంత్రి  అయిన తరువాత చట్టానికి, న్యాయానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థ ను కాపాడుతూ ప్రజాపాలన సాగిస్తున్నారని ఆయన  స్పష్టం చేశారు. 

గత వేసవికాలం లో జిల్లా కలెక్టర్ నేతృత్వంలో 99% నీటి ఎద్దడి లేకుండా సాఫీగా తాగునీరు సమస్యలు నివారించడానికి అధికారులు పనిచేశారని ప్రజా సమస్యలపైన అధికారులు ఎంతో నిబద్ధతతో పనిచేశారని అభినందించారు.  గత సంవత్సరం విద్యాశాఖ అధికారుల  కృషి వల్ల మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే గిఫ్ట్ డిజిటల్ కంటెంట్ బుక్స్ ద్వారా పదవ తరగతి పబ్లిక్ పరీక్షలో  విద్యార్థులు 20% అధిక ఫలితాలు సాధించారని వారు చేసిన కృషి ఫలితంగా ఎంతో మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సైతం మంచి ఫలితాలు సాధించారని తెలిపారు. ఇదే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయడానికి  డిజిటల్ కంటెంట్ బుక్స్ అందించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని చెప్పారు.  తొలిసారిగా  పాఠశాల  ప్రారంభం రోజునే విద్యార్థులకు  యూనిఫాం టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగింది అని   ఆయన తెలిపారు.  సాంకేతిక విషయాలు, చిన్న చిన్న విషయాలు చూపి ఎలాంటి అభివృద్ధి పనులను ఆపకండి అని,  ఎవరైనా ప్రజలు సమస్యలతో వస్తే మానవీయ కోణం లో పనిచేయాలని సూచించారు.  గ్రామీణ ప్రాంతాల్లో 296 డబుల్ బెడ్రూం ఇండ్లు పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు ఎందుకు అలాట్ చేయలేదని హౌసింగ్ ఎఇ వైద్యం భాస్కర్ ను ప్రశ్నించారు.  

పట్టణం లో తిరుమల దేవుని గుట్ట రైల్వే గేటు సమస్య ప్రధానమైనదని, అక్కడ ప్రాంతం పూర్తిగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొందని  ఆర్ &  బి అధికారులు  వెంటనే సంబంధిత అధికారులతో చర్చించి రైల్వే బ్రిడ్జి ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలించాలని , అలాగే గుడ్డి మల్కాపూర్ నుంచి ఫతేపూర్ మైసమ్మ వరకు రోడ్డు ఏర్పాటు కోసం ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి ప్రజలకు రవాణా వ్యవస్థ మెరుగు పరచడానికి సమన్వయం చేసుకొని వారికి రోడ్డు వేయాలని సూచించారు.  డంపింగ్ యార్డ్ మార్పు గురించి శ్రద్ధ వహించాలి అని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించాలని ఆయన చెప్పారు.   అలాగే రానున్న వర్షాకాలంలో డ్రైనేజీ వ్యవస్థ నాలా తదితర అంశాలపై అధికారులు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలి చెప్పారు. 

రానున్న రోజుల్లో ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేస్తుందని,  అధికారులు  శ్రద్ధ వహించాలి అని,  ప్రతి ఒక్క శాఖ పనితీరు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలని అధికారులకు ఆదేశించారు.  టార్గెట్ నిర్ణయించుకుని పనిచేయాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకాన్ని 100% అమలు చేసేందుకు ప్రతి శాఖ క్రింది స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు పని చేయాలని ఆయన కోరారు.  ఇన్నాళ్లు మీరు పనిచేసిన వృత్తి మీ జీవితంలో  తీపి గుర్తుగా మిగిలిపోవాలని  ఆకాంక్షించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి గుగులోతు, మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు