5 July, 2026 | 5:38 PM

బైక్ ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. యువకుడికి తీవ్ర గాయాలు

11-06-2024 07:17 PM

నాగర్ కర్నూల్: ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా, బిజినపల్లి మండలం, మంగనూరు గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం... శ్రీశైలం నుండి మహబూబ్ నగర్ వెళుతున్న ఆర్టీసీ బస్సు మంగనూరులో అదే గ్రామానికి చెందిన  అల్వాల ఆంజనేయులు గౌడ్ (27) ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఢీకొట్టింది. దీంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆంజనేయులు పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు వెల్లడించాడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. ఈ ప్రమాదంపై బిజినపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.