16 July, 2026 | 2:45 PM

Breaking News

ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం ఎంతో అవసరం   •   స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి   •   నీటి విడుదల కోసం రైతుల ధర్నా   •   తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుపై ఎమ్మెల్యే వైఖరి తెలపాలి   •   వర్షం కోసం రైతుల పూజలు   •   జగ్గారం లో కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జారె   •   సీతారామ సాగర్ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేకాఫ్ పాయింట్ ను పరిశీలించిన మంత్రులు   •   హిందూ విద్యార్థిని కల్మాను చదవమనడం బాధకరం   •   హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారు: బండి సంజయ్   •   అమెరికా ఫెడ్ రిజర్వ్ లో ఆర్బీఐ మాజీ గవర్నర్ కీలక బాధ్యతలు   •  

ప్రభుత్వాసుపత్రి సేవలను సద్వినియోగ చేసుకోవాలి

28-08-2024 03:06 PM

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

సూర్యాపేట, (విజయక్రాంతి):  ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిని పరిశీలించి వార్డు వార్డు తిరుగుతూ రోగులతో మాట్లాడి వైద్యం అందుతున్న తీరును తెలుసుకొని డాక్టర్లకు పలు సూచనలు చేశారు. విష జ్వరాలతో పాటు డెంగ్యూ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల మందులు పరీక్షలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు వైరల్ ఫీవర్ను డెంగ్యూగా భావించి ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. డెంగ్యూ వ్యాధిని ఎన్ఎస్ఓ పరీక్ష ద్వారా మాత్రమే నిర్డారణ చేయడం జరుగుతుందన్నారు.

డెంగ్యూ వ్యాధికి సంబంధించిన అన్ని రకాల మందులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు బయటి చికిత్సలు చేయించుకొని ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదన్నారు. విష జ్వరాన్ని డెంగ్యూగా భావించరాదని ఎన్ఎస్ఓ  టెస్టు అనంతరమే డెంగ్యూ గా నిర్ధారణ చేసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే చెబుతుందన్నారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో మందులతో పాటు 24గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉంటారని అన్నారు. రోగులకు ఆహారంతో పాటు అన్ని రకాల వసతులను కల్పించడం జరుగుతుందని ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యాన్ని పొందాలని అన్నారు. అనంతరం కలెక్టర్ ప్రతి వార్డు తిరుగుతూ ప్రతి రోగిని పలకరిస్తూ సమస్యలు తెలుసుకొని డాక్టర్లకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ ఆసుపత్రి ఇన్చార్జి సూపరింటెండెంట్ శ్రీకాంత్,  జనార్దన్, మున్సిపల్ కమిషనర్ బి.శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.