21-02-2026 01:42:25 AM
సమస్యలు పరిష్కరిస్తామని హామీ
వరంగల్, ఫిబ్రవరి 20(విజయక్రాంతి): నగరంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను శుక్రవారం వరంగల్ జిల్లా కలెకర్ సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మార్కెట్ యార్డులో పర్యటించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.
వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్‌స అండ్ ఇండస్ట్రీ అధ్యక్షులు బొమ్మినేని రవీందర్ గౌడ్ ఇప్పటికే జిల్లా కలెక్టర్ సత్య శారదని కలిసి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో ఎదురవుతున్న పలు ఇబ్బందులు, ముసలమ్మ కుంట మామిడిపండ్ల మార్కెట్ లో మౌలిక సదుపాయాల కల్పన కోసం, లక్ష్మీపురం సమీకృత పండ్ల మార్కెట్ నిర్మాణంలో జాప్యం నివారించుట, వ్యవసాయ మార్కెట్ పరిసరాల్లో ఆర్టీవో నిర్వహిస్తున్న వాహనాల తనిఖీల గురించి విన్నవిస్తూ ఇచ్చిన పలు లేఖల ద్వారా సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ మేరకు స్పందించిన కలెక్టర్ శుక్రవారం ఉదయం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు జిల్లా కలెక్టర్‌కి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో పర్యటించి పరిస్థితిలను స్వయంగా పరిశీలించినారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులకు, మార్కెట్ అధికారులకు పలు సూచనలు చేశారు.
ముఖ్యంగా మామిడి పండ్ల సీజన్ ప్రారంభము కాబోతునందున్న ఇటీవల ముసలమ్మ కుంటలో కేటాయించిన స్థలంలో రోడ్డు సౌకర్యం, మౌలిక సదుపాయాల కల్పన కోసం తీసుకోవలసిన చర్యలను మార్కెట్ అధికారులకు సూచిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అలాగే లక్ష్మీపురం సమీకృత సూపర్ మార్కెట్ నిర్మాణం గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నందున నిర్మాణ పనులను వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో వీలైనంత త్వరలో పూర్తి చేయుటకు సంబంధిత మున్సిపల్, మార్కెటింగ్ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పరిష్కరించి ఉద్యానవన రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. అలాగే మిగిలిన సమస్యలు కూడా పరిష్కరిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కలెక్టర్ వెంట చాంబర్ కార్యవర్గ సభ్యులు, వివిధ సెక్షన్ల అధ్యక్ష, కార్యదర్శులు తదితరులు