28 June, 2026 | 12:22 PM

Breaking News

పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •   ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియను సక్రమంగా నిర్వహించాలి   •  

కాంగ్రెస్ నేత జీవన్‌రెడ్డికి అస్వస్థత

21-02-2026 01:43 AM

ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన మంత్రి అడ్లూరి 

హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి) : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యా రు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండటంతో  కుటుంబ సభ్యులు బేగం పేటలోని ఒక ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్చించారు. విషయం తెలుసుకున్న రా ష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆస్పత్రికి వెళ్లి జీవన్‌రెడ్డిని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జీవన్‌రెడ్డి కి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు మంత్రి సూచించారు. త్వరగా కోలుకోవాలని మంత్రి ఆకాంక్షించారు.