calender_icon.png 11 January, 2026 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గరిమెళ్లపాడు హెచ్‌ఎన్‌టీసీని సందర్శించిన కలెక్టర్

02-01-2026 12:00:00 AM

చుంచుపల్లి, జనవరి 1, (విజయక్రాంతి): జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ గురువారం గరిమెళ్ళపాడు హెచ్ ఎన్ టి సి నర్సరీని సందర్శించారు. సుమారు 72 ఎకరాల్లో విస్తరించి ఉన్న గరిమెళ్ళపాడు నర్సరీని పూర్తిగా కలియతిరిగి పరిశీలించారు. గతంలో ఉన్న పాత భవనాలను ఒక్కొక్కటిగా నిశితంగా పరిశీలించారు.అలాగే ప్రస్తుతం నర్సరీలో ఉన్న మొక్కలు, గతంలో ఉన్న మొక్కలు, వి విధ విభాగాలు తదితర ప్రతి ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడి, హార్టికల్చర్ సిబ్బం ది రాజారామ్ నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నారు.తదనుగుణంగా గతంలో నర్సరీ ఏ విధంగా ఉండేదో, ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందో సమీక్షించి, మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి అవసరమైన చర్యలపై ప్రణాళికలు రూపొందించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒకప్పటిలాగా మళ్లీ పూర్వ వైభ వం తీర్చిదిద్దేలా చర్యలు తీసుకునేలా సం బంధిత అధికారులతో చర్చించి ప్రణాళికలు రూపొందిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.