calender_icon.png 11 January, 2026 | 6:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబులెన్స్‌లో ప్రసవం.. తల్లి,బిడ్డ క్షేమం

02-01-2026 12:00:00 AM

కేసముద్రం, జనవరి 1 (విజయక్రాంతి): పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ సిబ్బంది కాన్పు నిర్వహించి తల్లి బిడ్డను  ప్రాణాలతో రక్షించారు. మహబూబాబాద్ జిల్లాలోని కేసముద్రంకు చెందిన గర్భిణీ మైదం పద్మకు పురిటి నొప్పులు రావడంతో 108కి సమాచారం అందించారు. హుటాహుటిన ఇనుగుర్తి మండలానికి చెందిన అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని 108 వాహనంలో ఆసుపత్రికి తరలిస్తుండగా మా ర్గ మధ్యలో ఆమెకు పురిటి నొప్పులు తీవ్రం కావడంతో 108 ఈ ఎం టి ఎలమద్రి ప్రభాకర్, పైలట్ రఘు స్పందించి వాహనంలోనే సుఖ ప్రసవం చేసి తల్లీ, బిడ్డల్ని రక్షించారు. తల్లీ బిడ్డను కాపాడిన 108 సిబ్బందికి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.