calender_icon.png 11 January, 2026 | 10:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు సరిపడా యూరియా నిల్వలు

02-01-2026 12:00:00 AM

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

యూరియా కొరత ఉంది 

అనే దుష్ప్రచారాలను రైతులు నమ్మవద్దు

ఖమ్మం, జనవరి 1(విజయ క్రాంతి): సాగు చేసే రైతులకు సరిపడా యూరియా స్టాక్ జిల్లాలో అందుబాటులో ఉందని, రైతు లు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సకాలంలో యూరియా పంపిణీ చేసేం దుకు అన్ని మండలాల్లో సమగ్ర చర్యలు చేపట్టామని,మార్క్ ఫెడ్ ద్వారా యూరియా నిల్వలను ప్యాక్స్ (ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు), ప్రైవేట్ డీలర్లకు అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని అన్నారు.

ప్రస్తుతం మన ఖమ్మం జిల్లాలో 13 వేల 453 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ అందుబాటులో ఉందని, ఇప్పటివరకు రైతులకు 22 వేల 472 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేసినట్లు కలెక్టర్ తెలిపారు. యూరియా పంపిణీ సంబంధిత అం శాలలో రైతులు ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, జిల్లా యంత్రాగం, జిల్లా వ్యవసాయశాఖ యూరి యా సరఫరాను నిరంతరం పర్యవేక్షిస్తోందని, ఎటు వంటి సమస్యలు ఉన్నా, మీ మండల వ్యవసాయ అధికారి, వ్యవసాయ విస్తరణ అధికా రి దృష్టికి తీసుకుని రావాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.