ఘనంగా కళాశాల వార్షికోత్సవం
కాగజ్‌నగర్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): కాగజ్‌నగర్ పట్టణంలోని త్రిశూల్ పహాడ్ పై ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవం, స్పోర్ట్స్ డే వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడా రంగంలో కూడా రాణించాలని అన్నారు. రూ.3.4కోట్ల పీఎం ఉషా ని ధుల ద్వారా అదనపు తరగతుల నిర్మా ణం శరవేగంగా సాగుతోందని తెలిపారు.
డిగ్రీ కళాశాలను రెసిడెన్షియల్ కళాశాలగా మార్చడానికి ప్రతిపాదనలు పంపించామాని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్స్ శ్రీదేవి, ప్రొఫెసర్ జై కిషన్ ఓజా, డా.కనకయ్య, వైస్ ప్రిన్సిపల్ డా.లక్ష్మీ నరసింహం, అధ్యాపకులు జనార్ధన్, రాజేశ్వర్, డా. శారద, దత్తాత్రేయ, డా.దేవేందర్, రోజ్ మేరీ, వెంకటేశం, కృష్ణవేణి, శాంభవి, సానియా, అపూర్వ, రజిత, విద్యార్థులు పాల్గొన్నారు.




