ట్రంప్ రాకముందే వచ్చేయండి
భారత్ సహా విదేశీ విద్యార్థులకు యూఎస్ వర్సిటీల సూచన
న్యూయార్క్, నవంబర్ 30: శీతాకాల సెలవుల్లో భాగంగా స్వదేశాల కు వెళ్తున్న భారత్ సహా ఇతర విదేశీ విద్యార్థులకు అమెరికా యూనివర్సిటీలు కీలక సూచనలు చేశాయి. అ మెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే తిరిగి వచ్చేయాలని హె చ్చరించాయి. జనవరి 20న ట్రంప్ అధికార బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే ప్రవేశాల నిషి ద్ధం, విమానాశ్రయాల్లో నిబంధనలను కఠినతరం అయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి.
చెల్లుబాటయ్యే వీసా, ఇతర ప్రయాణ పత్రా లు సక్రమంగా ఉన్నప్పటికీ చాన్స్ తీసుకోవద్దని తెలిపాయి. ట్రంప్ గతంలో ఏడు ముస్లిం దేశాల పౌరులపై ట్రావెల్ బ్యాన్‌ను విధించిన విషయాన్ని గుర్తు చేశాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా అమెరికా చరిత్రలోనే ఎన్నడూ లేనంత స్థాయిలో వలసదారులను వెనక్కి పంపిస్తానని ప్రకటించారు. దీంతో యూని వర్సిటీలు విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా సూచనలు చేస్తున్నాయి.






