10 July, 2026 | 9:22 AM

భార్యకు నగలు కొంటే భర్తకు జాక్‌పాట్

01-12-2024 02:54 AM

సింగపూర్, నవంబర్ 30: భార్య కోసం నగలు కొనడానికి వెళ్లిన భారత సంతతి వ్యక్తికి జాక్‌పాట్ తగిలింది. లక్కీ డ్రాలో ఏకంగా రూ .8.45కోట్లు గెలుచుకున్నాడు. సింగపూర్‌లో ఈ నెల 24న చోటు చేసు కున్న ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్‌కు చెందిన చిదంబరం అనే వ్యక్తి మూడు నెలల క్రితం సింగపూర్‌లో ముస్తఫా అనే నగల దుకాణానికి వెళ్లారు. అక్కడ సుమారు రూ.3.7లక్షల విలువైన ఆభరణాలను తన భార్య కోసం కొనుగోలు చేశారు.

ఈ క్రమంలోనే నగల దుకాణం నిర్వాహకులు తాజాగా లక్కీ డ్రా తీయగా అందులో ఆయన ఒక మిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షాపు నిర్వాహకులు వెల్లడించారు. లక్కీ డ్రాలో పెద్ద మొత్తంలో డబ్బులు గెలుచుకోవడంపట్ల చిదంబంర సంతోషం వ్యక్తం చేశారు.