10 July, 2026 | 7:24 AM

పాలస్తీనాకు మోదీ సంఘీభావ లేఖ

01-12-2024 02:37 AM

మద్దతుగా ఉంటామని హామీ

న్యూఢిల్లీ, నవంబర్ 30: పాలస్తీనా అభివృద్ధికి భారత ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం సందర్భంగా పాలస్తీనా ప్రజలకు ప్రధాని మోదీ శనివారం లేఖ రాశా రు. అక్కడ కొనసాగుతున్న ఘర్షణలపై ఆందోళన వ్యక్తం చేశారు. హ మాస్ మధ్య యుద్ధం కారణంగా కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఇరు వర్గాలు తక్షణ మే కాల్పులను విరమణ జరిపి బం దీలను విడుదల చేయాలని కోరారు. ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. ప్రధాని లేఖపై న్యూఢిల్లీలోని పాలస్తీనా రాయబార కార్యాలయం స్పందించింది. గాజా ప్రజలకు మానవతా సాయం కొనసాగించే విషయంలో భారత్ తన నిబద్ధతను కలిగి ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది. హమాస్ మధ్య సమస్యలు త్వర లోనే పరిష్కారమవుతాయని ఆశాభావం వ్యక్తం చేసింది.