21 July, 2026 | 12:10 PM

ఇటు రావే నా చెలియా..

21-07-2026 01:16 AM

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని.. అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా పరిచయమవుతున్నారు. బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానిని కూడా ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారు. ఈ సినిమాలో సీనియర్ నటుడు మోహన్‌బాబు శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి పీ కిరణ్ నిర్మాత కాగా, అశ్వినిదత్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.

ఇప్పటివరకు విడుదలైన పాటలు, టీజర్లు, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘రావే చెలియా’ సాంగ్‌ను లాంచ్ చేశారు. ‘రావే ఇటు రావే నా చెలియా ఇటు రావే.. నా ప్రాణం నను వీడి నీవైపే కదిలేనే.. ఏకాంతం చెరలోనే బందీనై ఉన్నానే.. కాలం అడ్డున్నా ఏ గాయం కోస్తున్నా.. నీకై వేచున్నా.. నువు రానని చెబుతున్నా.. నువు లేకుంటే ననంటూ ఉన్నా లేనట్టేగా.. విరహాన్నే నాలో మోస్తూ.. బ్రతికున్నా భారంగా.. ప్రేమంటే నువ్వేనంటూ అనుకుంటే ఏకంగా.. జాలైనా చూపక నన్నే మరిచావే శాపంగా..’ అంటూ సాగుతోందీ గీతం.

జీవీ ప్రకాశ్‌కుమార్ స్వరపర్చిన ఈ పాటకు నాగ్ అర్జున్‌రెడ్డి సాహి త్యాన్ని అందించగా, కపిల్ కపిలన్ ఆలపించారు. ఈ పాటలో జయకృష్ణ, రాషా తడానీ మధ్య ప్రేమ, దూరమైనప్పుడు కలిగిన భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకు నేలా ఉన్నాయి. ఈ చిత్రం జూలై 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.