18 March, 2026 | 6:05 AM

రైతు మహోత్సవానికి తరలిరండి

18-03-2026 12:00 AM
  1. ‘22న సీఎం చేతుల మీదుగా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ప్రారంభం

‘నర్మెట్ట నుంచే రైతు భరోసా నిధులు విడుదల

‘మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి

నంగునూరు, మార్చి 17:రైతులకు వ్యవసాయ రంగం పై అవగాహన కల్పించేందుకు ఈ నెల 20 నుండి 22 వరకు నంగునూరు మండలం నర్మెట్ట లో రైతు మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా వ్యవసాయ,పశుసంవర్ధక శాఖల స్టాల్స్, స్టార్టప్ల ప్రదర్శనలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు.

చివరి రోజు 22న సా యంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నర్మెట్ట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించి, రైతు భరోసా నిధులను విడుదల చేస్తారని మంత్రి వెల్లడించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ఆదర్శ రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.