హోర్ముజ్ రక్షణకు రండి
- జలసంధికి యుద్ధ నౌకలను పంపండి
- ఏడు దేశాలకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలుపు
- షరతులకు అంగీకరిస్తేనే వస్తామన్న చైనా
- మేం రాలేం.. మా నౌకలు పంపండం లేదు
- తిరిస్కరించిన మిత్రదేశాలు ఆస్ట్రేలియా, జపాన్
- ముందు మీతో చర్చిస్తామన్న దక్షిణ కొరియా
వాషింగ్టన్, మార్చి 16: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో హోర్ముజ్ వద్ద ఇంధన రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు వెళ్లకుండా దానిని ఇరాన్ మూసివేసింది. ఇరాన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న హోర్ముజ్‌ను సురక్షితంగా ఉంచేందుకు, ఇంధన రవాణాను క్రమబద్ధీకరించేందుకు ముందుకురా వాలని ట్రంప్ పలు దేశాలను కోరారు. అయితే ఆయా దేశాలు ట్రంప్ పిలుపును తిరస్కరించాయి. షరతులకు అంగీకరిస్తేనే వస్తామని చైనా పేర్కొనగా, ‘మేం రాలేం.. మా నౌకలు అక్కడికి పంపడం లేదు’ అని ఆస్ట్రేలియా, జాపాన్ తెలిపాయి.
యుద్ధనౌకలను పంపడానికి ముందు అమెరికాతో చర్చిస్తామని దక్షిణ కొరియా చెప్పింది. దీంతో అగ్రరాజ్యానికి గట్టి ఎదురుదెబ్బ తగులుతోంది. ఆదివారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ.. హోర్ముజ్ ప్రాంతంలో చైనా ప్రయోజనాలే ఎక్కువని వ్యాఖ్యానించారు. ఆ జలసంధిని రక్షించేం దుకు ముందుకురావా లని బీజింగ్‌కు పిలుపునిచ్చారు. ఆ దేశం ఇచ్చే సమాధానాన్ని బట్టి బీజింగ్ పర్యటనకు వెళ్లాలా, వాయిదా వేయాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటానని వెల్లడించిన విషయం తెలిసిందే.
అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన పిలుపును మిత్రదేశాలు తిరస్కరిస్తున్నాయి. ట్రంప్ పిలుపుపై చైనా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. హోర్ముజ్ రక్షణకు తాము ముందుకు రావాలంటే.. పశ్చిమాసియాలో సైనిక కార్యకలాపాలను వెంటనే నిలిపివేయాలని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ ఇరువర్గాలకు సూచించారు. ఈ ఘర్షణల వల్ల అంతర్జాతీయ ఇంధన ప్రవాహం, ప్రాంతీయ శాంతి, ప్రపంచ స్థిరత్వం దెబ్బతిన్నా యని లిన్ జియాన్ పేర్కొన్నారు. యుద్ధం ఉద్రిక్తతలు మరింత ఉధృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని లిన్ జియాన్ అమెరికాకు సూచించారు.
ప్రస్తుత ఘర్షణలు ఆగితేనే ప్రాంతీయ స్థిరత్వం సాధించగలమ పేర్కొన్నారు. ఈనెల చివరలో ట్రంప్ బీజింగ్ పర్యటన గురించి అమెరికాతో చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో ఈ పర్యటన కీలకపాత్ర పోషి స్తుందని ఆయన తెలిపారు. ఇరాన్ యుద్ధం కారణంగా దెబ్బతిన్న హోర్ముజ్‌ను సురక్షితంగా ఉంచేందుకు, అక్కడ ఇంధన రవాణా ను క్రమబద్ధీక రించేందుకు యుద్ధ నౌకలను మోహరించాలని ట్రంప్ ఏడు దేశాలను కోరారు. అయితే ఆయన పిలుపును ఆస్ట్రేలియా, జపాన్ తిరస్కరించాయి.
హోర్ముజ్ వద్దకు ‘మేం ఎలాంటి నౌకలనూ పంపడం లేదు’ అని ఆస్ట్రేలియా వెల్లడించింది. జపాన్ నుంచి అలాంటి స్పందనే వచ్చింది. మారిటైమ్ సెక్యూరిటీ ఆపరేషన్లను పరిగణనలోకి తీసుకోవడం లేదని జపాన్ పేర్కొంది. యుద్ధ నౌకలను పంపించడంపై నిర్ణయం తీసుకునేముందు అమెరికాతో చర్చలు జరుపుతామని దక్షిణ కొరియా వెల్లడించింది. బ్రిటన్ కూడా ఈ విషయమై ఆచితూచి స్పందించింది. యుద్ధ నౌకలను పంపించే విషయంలో ట్రంప్‌తో చర్చిస్తున్నామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ పేర్కొన్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీతో కూడా చర్చించినట్టు తెలిపారు.




