calender_icon.png 15 November, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తనిఖీలకు వస్తున్నా.. సరిచేసుకోండి

10-08-2024 04:56:01 AM

  1. గురుకుల వార్డెన్‌కు ఆర్‌ఎల్‌సీ సమాచారం 
  2. నాగర్‌కర్నూల్ ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు ఎండబ్య్లూవో మెమో

నాగర్‌కర్నూల్, ఆగస్టు 9 (విజయక్రాంతి): విజయక్రాంతి దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘ఆహారం విషం’ అనే వార్తకథనాన్ని జిల్లా అధికారులు స్పందించారు. నాగర్‌కర్నూల్ ఆర్‌ఎల్‌సీ కిరన్మయి తాను తనిఖీలకు వస్తున్నట్టు ముందస్తు సమాచారాన్ని నాగర్‌కర్నూల్ మైనారిటీ గురుకుల వార్డెన్ దర్వేషుకు ఇచ్చారు. సదరు అధికారి తనిఖీ చేసే సమయంలోనే విజయక్రాంతి కూడా తనిఖీలో పాల్గొన్నది. సివిల్ సప్లయ్ పంపిన బియ్యాన్ని పందికొక్కులు తవ్వినట్టు చిందరవందరగా నిర్లక్ష్యంగా వదిలేశారు. కూరగా యలు కుల్లిపోయి కనిపించాయి. మూడురోజులుగా ప్రిన్సిపాల్ సుంకన్న సెలవులో ఉండ గా అనధికారికంగా పదిరోజులుగా డుమ్మా కొట్టినట్టు తెలిసింది. విజయక్రాంతి కథనానికి స్పందించిన మైనారిటీ వెల్‌ఫేర్ ఆఫీసర్ గోపాల్ సంజాయిషీ కోరు తూ ప్రిన్సిపాల్, వార్డెన్‌లకు మెమోలు జారీ చేశారు.