10-08-2024 04:57:48 AM
కరీంనగర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): వ్యవసాయం చేయడాన్ని యువత నామూషీగా భావించొద్దని, ప్రభుత్వం అందజేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం చిగురుమామిడి మండలం ఇందుర్తి, ముదిమా ణిక్యం గ్రామాల్లోని రైతు వేదికల్లో వ్యవసాయ, అనుబంధ రంగాల పథకాలపై అవ గాహన సదస్సు నిర్వహించారు. మంత్రి హాజరై మాట్లాడుతూ.. యువత వ్యవసా యం చేయడాన్ని నాముషిగా భావించరాదని, ఉన్నత చదువులు చదువుకుని, ఐటీ ఉద్యోగాలు చేసేవారు కూడా వ్యవసాయమే పరమావధిగా కొనసాగుతున్నారని చెప్పారు.
వ్యవసాయ, ప్రభుత్వ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవడం, బ్యాంకుల నుంచి రుణాలను పొందడంలో హుస్నాబాద్ ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ అధికారుల ద్వారా రైతులకు సహకరిస్తున్న ట్లు తెలిపారు. రుణమాఫీ ఇబ్బందుల గురిం చి వ్యవసాయ కార్యాలయంలో రాతపూర్వకంగా తెలియజేస్తే సమస్యను పరి ష్కరి స్తారని చెప్పారు. అనంతరం రైతు వేదిక వద్ద మంత్రి మొక్కను నాటారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, పశుసంవర్థకశాఖ అధికారి శ్రీనివాస్, పట్టు పరిశ్రమశాఖ అధికారి శ్రీనివాస్, సెరికల్చరల్ అధికారి రషీద్ పాల్గొన్నారు.