2 June, 2026 | 11:51 AM

Breaking News

పదవీత్యాగాలకే కాదు.. ప్రాణత్యాగానికీ వెనుదీయని నేత కేసీఆర్   •   బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   సుప్రీంకోర్టులో ఐదుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణం   •   తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే ప్రయత్నాన్ని సహించేది లేదు   •   ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   లారీని ఢీకొట్టిన కారు.. సిద్దిపేటలో ఇద్దరు మృతి   •   తెలంగాణ బలానికి, ఆశయాలకు ప్రతీక: నితిన్ నబిన్   •   ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు   •   అభివృద్ధి ఫలాలు ప్రతి పేద కుటుంబానికి చేరాలి   •   జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు   •  

కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి

11-04-2026 05:54 PM

ఆలేరు,(విజయక్రాంతి): యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని పార్టీ కార్యాలయంలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య సంస్థ స్థాపకుడు కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర నాయకులు కామ్రేడ్ పంగ అంజయ్య మాట్లాడుతూ... కళ కల కోసం కాదని, కళ కాసుల కోసం కాదని, కళ ప్రజల కోసమని ప్రజా చైతన్యం కోసమని, ప్రజా సమస్యల పరిష్కారం కోసమని భావించి కామ్రేడ్ కానూరి బాల్యం నుండి తన జీవితమంతా నిత్యం ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి వివిధ కళారూపాలలు ప్రదర్శించాడని తెలిపారు. కామ్రేడ్ కానూరి జీవితం నేటి రచయితలకు, కవులకు, కళాకారులకు, గాయకులకు, స్ఫూర్తిదాయకమని తెలిపారు.