భాగిర్తిపల్లిలో అంగన్వాడీ కేంద్రంలో అన్నప్రాశన, అక్షరాభ్యాసం
11-04-2026 05:52 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): మండలంలోని భాగిర్తిపల్లి గ్రామ అంగన్వాడీ కేంద్రంలో సర్పంచ్ గంగయ్యగారి నర్సింలు, ఉపసర్పంచ్ వడ్ల స్వామి ఆధ్వర్యంలో చిన్నారుల కోసం అన్నప్రాశన, అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకు మొదటి ఆహారం అందజేసి, విద్య ప్రారంభానికి శ్రీకారం చుట్టించారు. చిన్నారుల ఆరోగ్యం, పోషకాహారం ప్రాముఖ్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. పిల్లల భవిష్యత్తు మంచి దిశగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ శ్యామల, సిబ్బంది, తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.




