క్రీడలతో మానసిక ఉల్లాసం స్నేహభావం పెంపొందుతుంది
సిఐ ప్రవీణ్ కుమార్
తాండూరు,(విజయక్రాంతి): క్రీడలతో మానసిక ఉండాల్సిన స్నేహభావం శారీరక దారుఖ్యం పెంపొందుతుందని వికారాబాద్ జిల్లా తాండూర్ సిఐ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా పెద్దెముల మండలం తట్టెపల్లిలో స్వర్గీయ చంద్రప్ప, మొగులమ్మ ల జ్ఞాపకార్థం మొగుల్ చంద్ర ట్రస్ట్ చైర్మన్ ప్రభు కుమార్ ఆధ్వర్యంలో టిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ను గ్రామ సర్పంచ్ నారాయణ గౌడ్ తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని గెలుపొందిన వారు మునుముందు మరింత మెరుగైన ఆటను ప్రదర్శించాలని, ఓటమి చెందినవారు నిరాశ, నిస్పృహలకు గురి కాకుండా ఛాలెంజ్ గా తీసుకొని విజయం సాధించేందుకు పట్టుదలతో కృషి చేయాలని అన్నారు . ఇంకా ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ అంజయ్య టిఆర్ఎస్ నాయకులు మహబూబ్ క్రీడాకారులు తదితరులు భారీగా పాల్గొన్నారు.




