12-10-2025 06:15:47 PM
పీర్జాదిగూడ కమిషనర్ త్రిలేశ్వర రావు
మేడిపల్లి (విజయక్రాంతి): పోలియో రహిత సమాజంను నిర్మించుటకు ఐదు సంవత్సరాలలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, ఆదివారం నగరపాలక సంస్థ పరిధిలోని పలుచోట్ల ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని కమిషనర్ త్రివేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పోలియో వ్యాధి నుండి రక్షించడానికి ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములై పిల్లల భవిష్యత్తును రక్షించాలని కోరారు.
నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 17 కేంద్రాలుగా పల్స్ పోలియో బూతులను ఏర్పాటు చేసినట్లు సోమ, మంగళవారాల్లో కూడా ఇంటింటి సర్వే చేసి పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు ప్రవీణ, ప్రతిభ, శోభన, హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, వైద్య సిబ్బంది, నగరపాలక సిబ్బంది పాల్గొనడం జరిగింది.