12-10-2025 06:05:07 PM
రామచంద్రపురం: తెల్లాపూర్ పౌర సంఘం ఆధ్వర్యంలో గేటెడ్ కాలనీల వాసులు ఆదివారం రహదారిలో గుంతలను పూడ్చి మరమ్మతులు చేశారు. రహదారిపై జరిగిన ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి సభ్యులు సంతాపం తెలిపారు. గోపనపల్లి నుంచి కొల్లూరు వలయ రహదారి దశాబ్దాలుగా పూర్తికాలేదు. భవన నిర్మాణాల కారణంగా రహదారి మరీ దారుణంగా మారింది. గుంతలు, మట్టి కారణంగా ప్రమాదాలు జరుగుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను ప్రభుత్వానికి తీసుకెళ్లినా పరిష్కారం రాలేదని, అందువల్ల స్వయంగా రహదారిని మరమ్మతు చేయాలని నిర్ణయించుకున్నామని అన్నారు. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రహదారిని వెంటనే అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రవాణా శాఖ ఉప పరిశీలకుడు నవీన్ ట్రాఫిక్ సర్దుబాటు చేశారు.