రైతు సమస్యల పరిష్కారానికి కమిటీ
- హర్యానా, పంజాబ్ ప్రభుత్వాలు కమిటీకి సమస్యలు తెలపొచ్చు
- సమస్యలు పరిష్కరించాలి: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ, ఆగస్టు 22: ‘రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బహుళ సభ్యుల కమిటీ ఏర్పా టు చేస్తున్నాం, హర్యానా పంజాబ్ ప్రభుత్వాలు ఆ కమిటీకి సమస్యలను నివేదించవచ్చు’ అని సుప్రీం కోర్టు తెలిపింది. హరియాణాలోని అంబాలా సమీపంలోని శంభూ సరిహద్దు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లను వారం రోజుల్లో తొలగించాలని హర్యానా పంజాబ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ హర్యానా ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిం ది. ఈ పిటిషన్‌పై గురువారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
మరోవైపు ఆగస్టు 12న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రైతులతో సమావేశాలు నిర్వహించామని పంజాబ్ ప్రభుత్వం న్యాయస్థా నానికి తెలిపింది. జాతీయ రహదారిపై బారికేడ్లను పాక్షికంగా తొలగిస్తామని ప్రకటించింది. పంజాబ్, హర్యానా ప్రభుత్వాలు రైతులతో సామరస్యంగా వ్యవహరించాలని, జాతీయ రహదారులపై వారు ట్రాక్టర్లతోపాటు ఇతర వా హనాలను నిలపకుండా ఉండేందుకు వారిని ఒప్పించాలని సూచించింది. సామరస్యంగా రైతుల సమస్య లు పరిష్కరించాలని ఆదేశించింది. పంజాబ్ ఇప్పటికే న్యాయస్థానం సూచనలను అమలు చేస్తున్నది. తాజాగా కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో హరియాణా ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.






